
శ్రీదేవి, కమలహాసన్ (ఫైల్ ఫొటో)
చెన్నై : దివంగత నటి శ్రీదేవి తనుకు చెల్లెల్లాంటిదని తమిళ స్టార్ హీరో కమలహాసన్ స్పష్టం చేశారు. శ్రీదేవి, తనపై మీడియాలో వెలువడుతున్న కల్పిత కథనాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. శ్రీదేవి తనకు సోదర సమానురాలని, తన చిన్న చెల్లెలని, తాను కూడా ఆమె తల్లి చేతి గోరు ముద్దలు తిన్నానని గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో మా నటనను పరిశీలిస్తే మేం తోబుట్టువుల్లా కనిపిస్తామని తెలిపారు. లేని పోని వందతులు సృష్టించి ఇబ్బంది పెట్టవద్దని కమల్ మీడియాను కోరారు.
కాగా కోలీవుడ్‌లో శ్రీదేవి, కమలహాసన్ జోడీ అత్యంత విజయవంతమైన జోడిగా పేరొందింది. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫిస్ వద్ద కలెక్షన్లు కురిపించాయి. తాజాగా కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు శ్రీదేవికి సంబంధాలు అంటగడుతూ వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు.