
'కోర్ట్' సినిమాతో తెలుగమ్మాయి శ్రీదేవి మంచి విజయాన్ని అందుకుంది. హీరోయిన్‌గా తనకు ఇదే మొదటి సినిమా.. అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. కాకినాడ యువతి శ్రీదేవికి తాజాగా కోలీవుడ్ సినిమా ఛాన్స్ వచ్చింది. తన రెండో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. తొలి సినిమాతోనే మెప్పించిన మన తెలుగమ్మాయి ఇప్పుడు ఏకంగా కోలీవుడ్‌లో అవకాశం రావడంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.
కోలీవుడ్ ప్రముఖ నిర్మాతగ 'కేజీఆర్' హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే ఒక సినిమాలో ఆయన హీరోగా నటిస్తుండగా ఇప్పుడు రెండో సినిమాను ప్రకటించాడు. ఆయనకు జోడీగానే శ్రీదేవి నటిస్తుంది. కేజీఆర్‌కు నిర్మాతగా తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. గతంలో శివకార్తికేయన్‌తో హీరో, డాక్టర్, అయలాన్ సినిమాలు చేశారు. విజయ్ సేతుపతి కాపే రణసింగంతో పాటు ప్రభుదేవాతో గులేభకావలి వంటి సినిమాలను ఆయన నిర్మించారు. పలు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూటర్‌గా విడుదల చేశారు.
Kickstarting the pooja for #MiniStudios' production no.15, #KJR's next, with blessings and good vibes 🙏✨@ministudiosllp @KJRuniverse #ArjunAshokan #SrideviApalla #HarishKumar @AjuVarghesee @Abishek_jg @ashwin_kkumar @REGANSTANISLAUS @GhibranVaibodha @pvshankar_pv pic.twitter.com/hP5PDbtBq6
— Mini Studios LLP (@ministudiosllp) July 7, 2025