కూతురు మతం మారడంపై స్పందించిన హీరో | Kamal Haasan reacts on Akshara Haasan changed religion | Sakshi
Sakshi News home page

కూతురు మతం మారడంపై స్పందించిన హీరో

Jul 28 2017 8:50 PM | Updated on Sep 5 2017 5:05 PM

కూతురు మతం మారడంపై స్పందించిన హీరో

కూతురు మతం మారడంపై స్పందించిన హీరో

మతం మారానంటూ తన రెండో కూతురు అక్షరహాసన్ చేసిన సంచలన ప్రకటనపై ఆమె తండ్రి, సీనియర్ హీరో కమల్ హాసన్ స్పందించారు.

చెన్నై: మతం మారానంటూ తన రెండో కూతురు అక్షరహాసన్ చేసిన సంచలన ప్రకటనపై ఆమె తండ్రి, సీనియర్ హీరో కమల్ హాసన్ స్పందించారు. 'హాయ్ అక్షు. నువ్వు మతం మార్చుకున్నావా? నువ్వు మతం మారినా సరే నాకు నువ్వంటే ఇష్టమే. మతంతో సంబంధంలేని ప్రేమ నిస్వార్ధమైనదని నేను నమ్ముతాను. నీ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయ్. ప్రేమతో మీ బాపు (నాన్న)' కమల్ ట్వీట్ చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్షర హాసన్ మాట్లాడుతూ.. ఆస్తికత్వంపై నమ్మకం లేదంటూనే బౌద్ధమతానికి మారానని చెప్పింది‌. తనకు అక్క శృతీహాసన్ మాదిరిగా దేవుడిపై నమ్మకం లేదని, అయితే ఆసక్తితోనే బౌద్దమతం స్వీకరించినట్లు అక్షర వివరించింది. శివ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న వివేగం చిత్రం ద్వారా ఆమె కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది.

సంబంధిత కథనం

అందుకే మతం మారాను: నటి

Advertisement
 
Advertisement
Advertisement