భారతీయుడు ఆగలేదు | Kamal Haasan Indian 2 Movie is not dropped | Sakshi
Sakshi News home page

భారతీయుడు ఆగలేదు

May 8 2020 12:12 AM | Updated on May 8 2020 4:32 AM

Kamal Haasan Indian 2 Movie is not dropped - Sakshi

కమల్‌ హాసన్‌

‘‘భారతీయుడు’ సినిమా ఆగిపోయింది’’ అనే వార్త కోలీవుడ్‌ సర్కిల్‌ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్‌. కాజల్‌ అగర్వాల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. గతంలో పలు సార్లు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను లైకా ఖండించింది. తాజాగా మరోసారి కూడా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. లైకా నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ –  ‘‘ఇండియన్‌ 2’  చిత్రం షూటింగ్‌ సుమారు 60 శాతం పూర్తయింది. ఇంత పూర్తి చేశాక సినిమాను ఎందుకు ఆపేస్తాం? లాక్‌ డౌన్‌ పూర్తయిన వెంటనే షూటింగ్‌ మొదలుపెడతాం’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement