హీరోకు క్షమాపణ చెప్పిన కేఆర్కే | Kamaal R Khan apologises to Mohanlal for Chota Bheem remark | Sakshi
Sakshi News home page

హీరోకు క్షమాపణ చెప్పిన కేఆర్కే

Apr 23 2017 6:15 PM | Updated on Sep 5 2017 9:31 AM

హీరోకు క్షమాపణ చెప్పిన కేఆర్కే

హీరోకు క్షమాపణ చెప్పిన కేఆర్కే

మోహన్‌లాల్‌పై చేసిన వ్యాఖ్యలకు విమర్శకుడు కమాల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్కే) క్షమాపణ చెప్పాడు.

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌పై చేసిన వ్యాఖ్యలకు విమర్శకుడు కమాల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్కే) క్షమాపణ చెప్పాడు. ఆయన గురించి తెలియక అనుచిత వ్యాఖ్యలు చేశానని లెంపలేసుకున్నాడు. ‘సర్‌ మిమ్మల్ని ఛోటా భీమ్‌ అన్నందుకు క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే మీ గురించి నాకు పెద్దగా తెలియదు. మలయాళ సినిమాల్లో మీరు సూపర్ స్టార్‌ ఇప్పుడు తెలుసుకున్నాన’ని ట్వీట్‌ చేశాడు. తనకు తాను విమర్శకుడిగా చెప్పుకునే కేఆర్కే నిత్యం బాలీవుడ్‌ నటులపై దుమ్మెత్తిపోస్తుంటాడు.

రూ. వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో దుబాయ్‌ బిలియనీర్‌ బీఆర్‌ శెట్టీ తీయనున్న మహాభారతం చిత్రంలో మోహన్‌లాల్‌ ​భీముడి పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడికావడంతో ఆయనపై కూడా నోరు పారేసుకున్నాడు. ఛోటా భీమ్‌లా కనిపించే మోహన్‌లాల్‌ మహాభారతంలోని భీముడి పాత్రను పోషించడమా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. భీముడి ఆయుధమంతా కూడా ఉండని మోహన్‌లాల్‌ భీముడి పాత్ర పోషించాలనుకోవడం సరికాదని ఎకసెక్కమాడాడు. నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరకు క్షమాపణ చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement