శర్వాకు ‘హలో’ చెబుతోందా..!

Kalyani Priyadharshan - Sakshi

హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ కళ్యాణి ప్రియదర్శన్‌. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కళ్యాణి తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్‌ లాంటి స్టార్ హీరో సరసన పరిచయం కావటం కూడా కళ్యాణికి కలిసొచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో క్రేజ్ ప్రాజెక్ట్‌ కు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న శర్వానంద్‌ తదుపరి చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌ గా నటించనుంది. స్వామి రారా ,కేశల లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం కళ్యాణిని హీరోయిన్‌ గా సంప్రదించారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top