ఫుల్‌ ఫామ్‌! | Kalyan Ram to romance Mehreen | Sakshi
Sakshi News home page

ఫుల్‌ ఫామ్‌!

Jun 16 2019 3:03 AM | Updated on Jun 16 2019 3:03 AM

Kalyan Ram to romance Mehreen - Sakshi

మెహరీన్‌

వరుస అవకాశాలను దక్కించుకుంటూ హీరోయిన్‌ మెహరీన్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. కొంతకాలం డైరీలో ఖాళీ అన్న పదమే లేకండా కెరీర్‌ను బాగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఆల్రెడీ గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న ‘చాణక్య’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారీ బ్యూటీ. ఇటీవల సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ హీరోగా సైన్‌ చేసిన సినిమాలో హీరోయిన్‌గా మెహరీన్‌ ఎంపికయ్యారు. ఇప్పుడు తాజాగా కోలీవుడ్‌ హీరో ధనుష్‌ నటించనున్న సినిమాలో హీరోయిన్‌గా నటించే చాన్స్‌ కొట్టేశారామె.

శనివారం అధికారిక సమాచారం వెల్లడైంది. సత్యజోతి ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కొడి’ (తెలుగులో ‘ధర్మయోగి’గా డబ్‌ చేశారు) ఫేమ్‌ ఆర్‌.ఎస్‌. ధురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో షూటింగ్‌ ఆరంభం కానుంది. ‘‘ఈ సినిమా షూటింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ధనుష్‌తో నటించనుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు మెహరీన్‌. ఇలా వరుస సినిమాలతో మెహరీన్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement