ఆ భయం పోయింది

Kajal Aggarwal rings in 34th birthday at a private zoo in Dubai - Sakshi

దుబాయ్‌లో మస్త్‌గా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న ఓ ప్రైవేట్‌ జూలోకి వెళ్లారట. అక్కడి జంతువులతో సరదాగా టైమ్‌ స్పెండ్‌ చేశారు. ఈ విషయాన్నే కాజల్‌ చాలా ఎగై్జటింగ్‌గా చెబుతున్నారు. ‘‘కొన్ని జంతువులంటే నాకు చాలా భయం ఉండేది. వాటిని ఇంత క్లోజ్‌గా చూస్తానని అనుకోలేదు. ఇప్పుడు ఆ భయం పోయింది.

ఇలా నా భయం దూరం కావడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. నా బర్త్‌డే  సెలబ్రేషన్‌ విభిన్నంగా, మంచి అనుభూతితో జరిగినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కాజల్‌. ఇక కాజల్‌ సినిమాల ప్రస్తావనకు వస్తే.. ఆమె తెలుగులో ఒక కథానాయికగా నటించిన ‘రణరంగం’ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. శర్వానంద్‌ హీరో. అలాగే తమిళంలో కాజల్‌ నటించిన ‘కోమలి, ప్యారిస్‌ ప్యారిస్‌’ విడుదలకు సిద్ధమయ్యాయి. కమలహాసన్‌ ‘ఇండియన్‌ 2’లో కథా నాయికగా నటించనున్నారు. మరోవైపు ‘మను చరిత్ర’ అనే సినిమాను సమర్పిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top