కాజల్‌ ఫిక్స్‌.. న్యూ లుక్‌లోకి మారడమే తరువాయి

kajal Aggarwal In kamal Haasan And Shankar Indian 2 movie - Sakshi

శంకర్‌ అద్భుత సృష్టిలో కాజల్‌ భాగం కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘2.ఓ’ను రిలీజ్‌ చేసి రికార్డుల దిశగా పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే ఇప్పటికే శంకర్‌.. తన తదుపరి ప్రాజెక్ట్‌ ఇండియన్‌-2పైన దృష్టిపెట్టేశాడు. పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రషూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. 

అయితే ఈ చిత్రంలో కమల్‌హాసన్‌కు జోడిగా కాజల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారనే వార్త చక్కర్లు కొట్టన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇదే వార్త నిజమని తెలుస్తోంది. ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్‌ బాలా కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రాబోతోన్న ఇండియన్-2లో కాజల్‌హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ పాత్ర కోసం కొత్త లుక్‌ను ట్రై చేయనున్నట్లు, దీనికోసం అమెరికానుంచి ఓ బృందం రానున్నట్లు కాజల్‌ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్లు సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top