కొత్త హీరోతో కాజల్‌..!

Kajal Aggarwal In Dvv Danayya Son Debut Movie - Sakshi

మరో స్టార్ వారసుడి వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుస విజయాలు సాధిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత దానయ్య తన కుమారుడ్ని హీరో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎంతో మంది నటులను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌ గా కాజల్‌ అగర్వాల్‌ను ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ ఫైనల్‌ అయ్యిందని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top