ప్రేమలో కొత్త కోణ ం | Kailasapuram Kings Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

ప్రేమలో కొత్త కోణ ం

Oct 11 2019 1:36 AM | Updated on Oct 11 2019 1:36 AM

Kailasapuram Kings Movie Teaser Launch - Sakshi

గరిమా సింగ్‌, రమేష్‌ కుర్మాపు

రమేష్‌ కుర్మాపు, గరిమా సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కైలాసపురం కింగ్స్‌’. కులదీప్‌ రాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్రౌండ్‌ ఫండింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాను. వైజాగ్‌ నేపథ్యంలో జరిగే మాస్‌ ఎంటర్‌టైనింగ్‌ చిత్రమిది’’ అన్నారు. ‘‘మాస్‌ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది’’ అన్నారు కులదీప్‌. ‘‘పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అన్నారు రమేష్‌. ‘‘ప్రేమలోని కొత్త కోణాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు’’ అన్నారు గరిమా సింగ్‌. ‘‘ఈ సినిమాతో రమేష్‌కి ఇంకా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్‌. నిర్మాతలు రిజ్వాన్, తేజ్‌ వైజాగ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement