‘కబీర్‌ సింగ్‌’ వచ్చేస్తున్నాడు

Kabir Singh Teaser On 8th April - Sakshi

‘అర్జున్‌ రెడ్డి’తో సంచలనం సృష్టించాడు హీరో విజయ్‌ దేవరకొండ. ఈ మూవీ తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్‌హీరో. అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా ఫుల్‌ ఫేమస్‌ అయ్యాడు. టాలీవుడ్‌లో అంతటి సెన్సేషన్‌ సృష్టించిన ఈ చిత్రాన్ని.. మిగతా భాషల్లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

షాహిద్‌ కపూర్‌ హీరోగా.. హిందీలో ‘కబీర్‌ సింగ్‌’  చిత్రాన్ని సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ టీజర్‌ను ఏప్రిల్‌ 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌ 21న విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top