ఝాన్సీగా జ్యోతిక | Jyothika Tamil film Naachiyaar in Telugu as Jhansi | Sakshi
Sakshi News home page

Jul 14 2018 10:42 AM | Updated on Jul 14 2018 11:25 AM

Jyothika Tamil film Naachiyaar in Telugu as Jhansi - Sakshi

కోలీవుడ్ సెన్సేషనల్‌ డైరెక్టర్ బాల దర్శక నిర్మాతగా తెరకెక్కించిన సినిమా నాచియార్‌. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను తెలుగులో డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ రిలీజ్ చేస్తున్నారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్‌ నటి జోత్యిక పోలీసాఫీసర్‌ పాత్రలో నటించారు. రిలీజ్‌కు ముందు వివాదాస్పదమైన జ్యోతిక పాత్రకు సినిమా రిలీజ్ తరువాత మంచి ప్రశంసలు దక్కాయి.

యువ నటుడు జీవీ ప్రకాష్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందించటం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ను  ఝాన్సీ పేరుతో విడుదల చేస్తున్నారు. చాలా కాలం తరువాత జ్యోతిక తెలుగు తెర మీద కనిపించనుండటం సినిమాకు ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్‌. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement