జూలియట్‌.. ఇడియట్‌ల ప్రేమ | Juliet Laver Movie Teaser Released | Sakshi
Sakshi News home page

జూలియట్‌.. ఇడియట్‌ల ప్రేమ

Aug 10 2017 11:58 PM | Updated on Sep 17 2017 5:23 PM

జూలియట్‌.. ఇడియట్‌ల ప్రేమ

జూలియట్‌.. ఇడియట్‌ల ప్రేమ

దర్శకుడు సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అజయ్‌ వోధిరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌.

దర్శకుడు సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అజయ్‌ వోధిరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌. నవీన్‌ చంద్ర, నివేదా థామస్‌ జంటగా కొత్తపల్లి అనురాధ సమర్పణలో కొత్తపల్లి ఆర్‌.రఘుబాబు, కె.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

 నవీన్‌చంద్ర మాట్లాడుతూ– ‘‘ప్రతి లవర్‌ ఒక ఇడియట్టే. నేనొక ఇడియట్‌ లాంటి లవర్‌లా సినిమాలో కనిపిస్తా. విలువలున్న ప్రేమకథ ఇది’’ అన్నారు. ‘‘ఓ జూలియట్, ఓ ఇడియట్‌ ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నదే ఈ మూవీ. నవీన్‌ను ఇప్పటికీ ‘అందాలరాక్షసి’ నవీన్‌ అంటుంటారు. ఈ సినిమాతో ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’ నవీన్‌ అంటారు’’ అన్నారు అజయ్‌ వోధిరాల.  ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రవితేజ, లైన్‌ ప్రొడ్యూసర్‌: సురేష్‌ కొండవీటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement