బుడ్డోడికి భారీ టార్గెట్ | jr ntr trageting at 70 crores | Sakshi
Sakshi News home page

బుడ్డోడికి భారీ టార్గెట్

May 4 2016 11:04 AM | Updated on Sep 3 2017 11:24 PM

బుడ్డోడికి భారీ టార్గెట్

బుడ్డోడికి భారీ టార్గెట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమా జోరు మీద ఉన్నాడు. తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా వరుస సక్సెస్లు సాధించిన జూనియర్, ప్రస్తుతం ఓ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమా జోరు మీద ఉన్నాడు. తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా వరుస సక్సెస్లు సాధించిన జూనియర్, ప్రస్తుతం ఓ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల సక్సెస్లతో సూపర్ ఫాంలో ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు దక్షిణాది టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో జనతా గ్యారేజ్ మాలీవుడ్లో కూడా మంచి బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుకుంటున్న ఈ సినిమాకు రిలీజ్కు ముందే 65 కోట్ల వరకు బిజినెస్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ దాదాపు 70 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే సినిమా హిట్ లిస్ట్లోకి చేరుతోంది.

నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో కూడా భారీ బడ్జెట్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డ జూనియర్ ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి అనుకున్నట్టుగా జనతా గ్యారేజ్తో 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హైయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్లో స్థానం సంపాదిస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement