70 ఎన్‌కౌంటర్లు... 33 కేసులు | john abraham new movie batla house first look release | Sakshi
Sakshi News home page

70 ఎన్‌కౌంటర్లు... 33 కేసులు

Sep 22 2018 12:31 AM | Updated on Sep 22 2018 12:31 AM

john abraham new movie batla house first look release - Sakshi

జాన్‌ అబ్రహాం

ఈ ఏడాది ఆగస్టు 15కి ‘సత్యమేవ జయతే’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ సాధించారు బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహాం. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారాయన. వచ్చే ఏడాది అదే తేదీన ‘బట్లా హౌస్‌’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌) అనే సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి నిఖిల్‌ అద్వాని దర్శకత్వం వహిస్తున్నారు.

70 ఎన్‌కౌంటర్లు, 33 కేసులు, 22 నేరారోపణలు... మోస్ట్‌ కాంట్రవర్శల్‌ కాప్‌ అంటూ ఇలా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు జాన్‌ అబ్రహాం.ఈ సినిమాలో ఆఫీసర్‌ సంజయ్‌ యాదవ్‌ కుమార్‌ పాత్రలో కనిపిస్తారు జాన్‌ అబ్రహాం. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కానీ ‘బట్లా హౌస్‌’ చిత్రంతో పాటు అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’, రాజ్‌కుమార్‌రావు ‘మేడ్‌ ఇన్‌ చైనా’ సినిమాలు కూడా వచ్చే ఏడాది ఆగస్టు 15కే విడుదలకు రెడీ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement