భయపెట్టే జెస్సీ | Jessy Movie Press Meet | Sakshi
Sakshi News home page

భయపెట్టే జెస్సీ

Mar 12 2019 2:23 AM | Updated on Mar 12 2019 2:23 AM

Jessy Movie Press Meet - Sakshi

ఆషిమా, శ్రిత, శ్వేతా సింగ్, అశ్వినికుమార్, శ్రీచరణ్‌ పాకాల

అతుల్‌ కులకర్ణి, కబీర్‌ దుహన్‌ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. వి.అశ్వినికుమార్‌ దర్శకత్వంలో ఏకా ఆర్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై శ్వేతా సింగ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆషిమా నర్వాల్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేసి రెండేళ్లు అవుతోంది. అప్పటికీ.. ఇప్పటికీ చాలా మంది మారిపోయారు. ఇది నా మొదటి సినిమాగా విడుదల కావాల్సింది. కొన్ని కారణాలతో ఆలస్యం కావడంతో రెండో సినిమాగా విడుదవుతోంది.

ఈ చిత్రంలో మెయిన్‌లీడ్‌గా మంచి క్యారెక్టర్‌ చేశాను’’ అన్నారు. ‘‘హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పి.వి.ఆర్‌ సినిమాస్‌ ద్వారా మా సినిమా విడుదలవుతోంది’’ అన్నారు శ్వేతా సింగ్‌. ‘‘ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అశ్వినికుమార్‌. ‘‘ఈ సినిమాకు సంగీతం అందించడాన్ని ఎంజాయ్‌ చేశాను’’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌ పాకాల అన్నారు. ‘‘మంచి చిత్రం చేశాం. ఇందులో హారర్‌ కంటే ఇద్దరు సిస్టర్స్‌ మధ్య మంచి సెంటిమెంట్‌ మెప్పిస్తుంది’’ అన్నారు నటుడు విమల్‌ కృష్ణ. అభినవ్‌ గోమటం పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:  సునీల్‌కుమార్‌.ఎన్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement