మళ్లీ మళ్లీ చూసి మెసేజ్‌ చేస్తున్నారు | Jersey Movie Success Meet | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ చూసి మెసేజ్‌ చేస్తున్నారు

Apr 29 2019 1:33 AM | Updated on Apr 29 2019 1:33 AM

Jersey Movie Success Meet - Sakshi

పీడీవీ ప్రసాద్, రానా, నాని, శ్రద్ధా శ్రీనాథ్, రోనిత్, గౌతమ్‌ తిన్ననూరి, నాగవంశీ

‘‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. ‘అందరూ పాతబడిపోవచ్చు కానీ, ‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్‌ సినిమాగా మిగిలిపోతుంది’’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల అయింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్‌’లో నాని మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ రిలీజ్‌ తర్వాత నాకు వచ్చిన మెసేజెస్‌ కానీ, ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు సినిమా గురించి, నటన, టెక్నీషియన్స్‌ గురించి మాట్లాడుతున్న విధానం కానీ.. నెనెప్పుడూ ఎక్స్‌పీరియన్స్‌ చేయని ఒక ఫీలింగ్‌. ఏ సినిమాకైనా తొలి మూడు రోజులు బోల్డన్ని మెసేజ్‌లు, ఫీడ్‌బ్యాక్‌ వస్తుంటాయి. వారం తర్వాత ఆ ఫీడ్‌బ్యాక్‌ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘జెర్సీ’ కి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు మెసేజ్‌లతో మా ఫోన్లు నిండిపోతున్నాయి. రివర్స్‌లో మాకు థ్యాంక్యూ మెసేజ్‌లు వస్తున్నాయి.

అందుకే టీమ్‌ అందరి తరఫున ఒక ఫైనల్‌ థ్యాంక్యూ చెప్పాలని ఈ మీట్‌ ఏర్పాటుచేశాం.  చాలా ఎమోషన్‌ ఉన్న సినిమా కదా రిపీట్‌గా చూసేవాళ్లకి ఎలా ఉంటుందనుకున్నాం. కానీ, చాలా మంది మళ్లీ మళ్లీ చూసి మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వీటిని మెసేజ్‌లు అనలేను.. ఎందుకంటే ఓ చిన్న లవ్‌లెటర్స్‌లా ఉన్నాయి.. అందరికీ థ్యాంక్యూ సోమచ్‌. ‘జెర్సీ’ సినిమా చూసిన రానా కాల్‌ చేసినప్పుడు ఆ వాయిస్‌ నాకు గుర్తుంది.. వాడు(రానా) ఆల్‌మోస్ట్‌ ఏడిచినట్టున్నాడు.. కచ్చితంగా రానాను ఈ ఫంక్షనికి పిలుద్దామనుకున్నా. లాస్ట్‌ మినిట్‌లో ఫోన్‌ చేసినా వస్తాడులే అన్న నమ్మకం.. ఎందుకంటే వాడికి సినిమా ఎంత నచ్చిందో నాకు తెలుసు. మా కష్టానికి అంత రెస్పెక్ట్‌ చూపించిన ప్రేక్షకులందరికీ, మీడియాకి థ్యాంక్స్‌’’ అన్నారు.  

హీరో రానా మాట్లాడుతూ– ‘‘నేను సక్సెస్‌ మీట్‌కి వచ్చి చాలా రోజులు అయింది. కానీ, ‘జెర్సీ’ సినిమాకి రావాలనుకున్నా. ఎందుకంటే.. నాకు లైఫ్‌లో బేసిక్‌గా కొన్ని అర్థంకావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు. ఇవన్నీ అర్థం కాని నాకే ఈ సినిమా చూసి ఏడుపు వచ్చిందంటే ప్రేక్షకుల పరిస్థితి ఏమై ఉంటుందో నాకు తెలుసు. నాని నటన సూపర్‌. ప్రతిరోజు నాకు స్ఫూర్తినిస్తుంటాడు. వారంలో మూడు సార్లు తనని చూస్తాను. అయినా కానీ సినిమాపై అతనికి ఉన్న ప్రేమ చూస్తే ఎంతో కొత్తగా చేయాలని స్ఫూర్తినిస్తూ ఉంటుంది. ‘జెర్సీ’  కి పనిచేసిన వారందరికీ చెబుతున్నా. సినిమా అన్నది శాశ్వతం.. అందులో ‘జెర్సీ’ సినిమా కోసం ఎప్పుడూ ఒక పేజీ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు.

గౌతమ్‌ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వచ్చిన అభినందనలకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన చినబాబు, పీడీవీ ప్రసాద్, వంశీగార్లకు, నానీ సర్‌కి థ్యాంక్స్‌. సినిమా నేను డైరెక్షన్‌ చేసినా సరే నా బలం అంతా నా డైరెక్షన్‌ టీమ్‌. ఇంకా ఈ సినిమా చూడని వారెవరైనా ఉంటే చూడండి’’ అన్నారు.  
ఈ కార్యక్రమంలో శ్రద్ధా శ్రీనాథ్, చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement