చప్పగా 'జజ్బా' కలెక్షన్లు! | Jazbaa box office collections slow down | Sakshi
Sakshi News home page

చప్పగా 'జజ్బా' కలెక్షన్లు!

Oct 13 2015 7:09 PM | Updated on Apr 3 2019 7:12 PM

చప్పగా 'జజ్బా' కలెక్షన్లు! - Sakshi

చప్పగా 'జజ్బా' కలెక్షన్లు!

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తాజా చిత్రం 'జజ్బా' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సందడి చేయడం లేదు.

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తాజా చిత్రం 'జజ్బా' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సందడి చేయడం లేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఐశ్వర్య కమ్బ్యాక్ ఫిలింగా 'జజ్బా'పై ఎన్ని అంచనాలు నెలకొన్నా.. వసూళ్లు మాత్రం అంతగా లేవనే చెప్పాలి. అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా తొలిరోజు (శుక్రవారం) రూ. 4.23 కోట్లు, రెండోరోజు శనివారం 5.49 కోట్లు, ఆదివారం 5.52 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ లో మొత్తంగా రూ. 15.24 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వారమైన కలెక్షన్లు పుంజుకుంటాయంటే అదీ లేదు. గడిచిన సోమవారం ఆ సినిమా రూ. 2.11 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. విదేశీ మార్కెట్లో 1.2 మిలియన్ డాలర్లు (రూ. 7.81 కోట్లు) వసూలు చేసింది.

దర్శకుడు సంజయ్ గుప్తా తెరకెక్కించిన 'జజ్బా' సినిమాలో ఐశర్య ప్రధాన పాత్ర పోషించగా.. ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీ, జాకీ ష్రఫ్ ఇతర పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement