పద్మావత్‌ ఎఫెక్ట్‌ ఎవరిపై? | January 25 will hit 'Padmavati' and 'Padman', which will hit the big screen? | Sakshi
Sakshi News home page

పద్మావత్‌ ఎఫెక్ట్‌ ఎవరిపై?

Jan 8 2018 1:37 AM | Updated on Jan 8 2018 1:37 AM

January 25 will hit 'Padmavati' and 'Padman', which will hit the big screen? - Sakshi

పద్మావతి... కాదు.. కాదు.. ఇప్పుడు ‘పద్మావత్‌’. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘పద్మావత్‌’. సెన్సార్‌ కంప్లీట్‌ అయిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రజెంట్‌ బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. ఈ నెల 25 లేదా 26న రిలీజ్‌ అవుతుందని కొందరు, ఫిబ్రవరి 9న రిలీజ్‌ అవుతుందని మరికొందరి వాదన. ఒకవేళ ‘పద్మావత్‌’ ఈ నెల 25 లేదా 26న అని చిత్రబృందం రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేస్తే.. ఆల్రెడీ ఈ డేట్స్‌ను బుక్‌ చేసుకున్న ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘అయ్యారీ’ వాయిదా పడతాయా? అనే చర్చ జరుగుతోంది. ఆర్‌. బాల్కీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌కపూర్‌ నటించిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్‌’.


నీరజ్‌ పాండే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అయ్యారీ’. ఒకవేళ ‘పద్మావత్‌’ని 25 లేక 26న కాకుండా వార్తల్లో ఉన్నట్లు ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తే ఆల్రెడీ అదే తేదీన రిలీజ్‌ కానున్న అనుష్కా శర్మ ‘పరీ’ రిలీజ్‌ డేట్‌ భవితవ్యం ఏంటి? అనే చర్చ కూడా జరుగుతోంది. ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘అయ్యారీ’, ‘పరీ’.. ఈ మూడు చిత్రాల విడుదల విషయంలో క్లారిటీ రావాలంటే ‘పద్మావత్‌’ బృందం అధికారికంగా రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేయాల్సిందే. ఇంతకు ముందు ‘పద్మావత్‌’ సినిమాను గతేడాది డిసెంబర్‌ 1న రిలీజ్‌ చేయాలనుకున్నప్పుడు ‘102 నాటౌట్, తుమ్హారీ సులు, తేరా ఇంతిజార్, ఫిరంగీ, ఫక్రీ రిటర్న్స్‌’ చిత్రాల రిలీజ్‌ డేట్స్‌ విషయంలో మార్పులు జరిగాయి. మరి.. ఈసారి ‘పద్మావత్‌’ ఎఫెక్ట్‌ ఏయే సినిమాల మీద పడుతుందో చూడాలి.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement