ధడక్‌ ప్రమోషన్లలో వీరిదే హవా.. | Janhvi Ishaan Gearing Up For Release Of Dhadak Movie | Sakshi
Sakshi News home page

ధడక్‌ ప్రమోషన్లలో వీరిదే హవా..

Jul 12 2018 6:31 PM | Updated on Jul 12 2018 7:40 PM

Janhvi Ishaan Gearing Up For Release Of Dhadak Movie - Sakshi

ధడక్‌ ప్రమోషన్లలో జాన్వీ కపూర్‌, ఇషాన్‌ల సందడి

ముంబై : శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌, ఇషాన్‌ ఖట్టర్‌ల తొలి చిత్రం ధడక్‌ విడుదల కోసం స్టార్‌ కిడ్స్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందకొస్తున్న ఈ చిత్ర ప్రమోషన్లను మూవీ యూనిట్‌ వేగవంతం చేసింది.

మరాఠా మూవీ సైరాత్‌ రీమేక్‌గా శశాంక్‌ ఖైతన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ధడక్‌పై జాన్వీ సహా కపూర్‌ కుటుంబం భారీ ఆశలే పెట్టుకుంది. హీరో ఇషాన్‌ ఖట్టర్‌ గతంలో మాజిద్‌ దర్శఖత్వంలో బియాండ్‌ ద క్లౌడ్స్‌ అనే మూవీలో నటించాడు.వీరిద్దరూ ప్రేమికులుగా ధడక్‌లో ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. మరోవైపు మూవీ ప్రమోషన్స్‌లోనూ జాన్వీ, ఇషార్‌లే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ధడక్‌ మూవీని ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement