మాస్ హీరో గుర్తింపు వచ్చింది | Janda Pai Kapiraju Movie Success Meet | Sakshi
Sakshi News home page

మాస్ హీరో గుర్తింపు వచ్చింది

Mar 23 2015 11:49 PM | Updated on Sep 2 2017 11:16 PM

మాస్ హీరో గుర్తింపు వచ్చింది

మాస్ హీరో గుర్తింపు వచ్చింది

సమాజాన్ని సరిదిద్దాలంటే ముందు మనం మారాలి అనే కథాంశంతో వచ్చిన చిత్రం ‘జెండా పై కపిరాజు’.

 సమాజాన్ని సరిదిద్దాలంటే ముందు మనం మారాలి అనే కథాంశంతో వచ్చిన చిత్రం ‘జెండా పై కపిరాజు’. నాని, అమలాపాల్ జంటగా మల్టీ డెమైన్షన్ ఎంటెర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటడ్ పతాకంపై రజిత్ పార్థసారధి, కె.ఎస్. శ్రీనివాసన్ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా సక్సెస్ మీట్  హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ -‘‘నేను నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండా పై కపిరాజు’  ఒకేసారి రిలీజ్ అవుతున్నాయన్న టెన్షన్ నాలో ఉండేది. కానీ, ప్రేక్షకులు రెండు సినిమాలను బాగా ఆదరించారు. ‘జెండా పై కపిరాజు’ చూసి పరిశ్రమలోని పెద్దలందరూ అభినందించారు. మాస్ హీరోగా కూడా ఆదరించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు. తెలుగులో తాము చేసిన మొదటి ప్రయత్నానికి  మంచి విజయం అందించారని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీడైమన్షన్ వాసు, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement