100 కోట్ల క్లబ్ లో జనతా.. ఎన్టీఆర్ థ్రిల్ | 'Janatha Garage' mints Rs 100cr worldwide, NTR elated | Sakshi
Sakshi News home page

100 కోట్ల క్లబ్ లో జనతా.. ఎన్టీఆర్ థ్రిల్

Sep 8 2016 12:07 PM | Updated on Sep 4 2017 12:41 PM

100 కోట్ల క్లబ్ లో జనతా.. ఎన్టీఆర్ థ్రిల్

100 కోట్ల క్లబ్ లో జనతా.. ఎన్టీఆర్ థ్రిల్

టాలీవుడ్ లో వేగంగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన రెండో సినిమా ‘జనతా గ్యారేజ్’ ఘనత దక్కించుకోవడం పట్ల హీరో ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

చెన్నై: టాలీవుడ్ లో వేగంగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన రెండో సినిమా ‘జనతా గ్యారేజ్’  ఘనత దక్కించుకోవడం పట్ల హీరో ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల స్పందన తనను థ్రిల్ కు గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

‘జనతా గ్యారేజ్ కు వస్తున్న స్పందన నాకు సంతోషాన్ని కలిగించింది. నాకు అండగా నిలిచినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. నంబర్ గేమ్ కు ప్రాధాన్యం ఇవ్వనని ఇంతకుముందే చెప్పాను. నటుడిగా మంచి సినిమాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తాన’ని ఎన్టీఆర్ అన్నాడు.

కొరటాల శివ దర్శకత్వంలో 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’  విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత వేగంగా వంద కోట్లు వసూలు చేసిన సినిమా ఇదేనని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ రికార్డు కలెక్షన్లు సాధిస్తోందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement