వెయిట్ ఫర్ ‘అవతార్-2’ | James Cameron's 'Avatar' Sequels Coming | Sakshi
Sakshi News home page

వెయిట్ ఫర్ ‘అవతార్-2’

Jun 15 2015 11:10 PM | Updated on Sep 3 2017 3:47 AM

వెయిట్ ఫర్ ‘అవతార్-2’

వెయిట్ ఫర్ ‘అవతార్-2’

‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్.

 ‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త  ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ చిత్రాన్ని ప్రపంచ సినీ అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్స్ రెడీ చేస్తున్నారాయన. 2016లో రెండో భాగాన్ని, 2017, 18 సంవత్సరాల్లో మూడు, నాలుగు భాగాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు కూడా. కానీ, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదట. 2017 డిసెంబర్‌లో క్రిస్‌మస్ సందర్భంగా మొదటి సీక్వెల్‌ను, 2018, 2019 సంవత్సరాల్లో తర్వాతి భాగాలను విడుదల చేస్తామని ఇప్పుడు తాజాగా చెప్పారు కామెరూన్. అంటే ‘అవతార్’ పార్ట్2 కోసం మరో రెండేళ్లు నిరీక్షించక తప్పదు.
 

Advertisement
 
Advertisement
Advertisement