లవ్లీకుమార్‌ | 'Jai Lava Kusha' movie 'Jai' Getup posters released on monday | Sakshi
Sakshi News home page

లవ్లీకుమార్‌

Aug 8 2017 1:04 AM | Updated on Sep 17 2017 5:16 PM

లవ్లీకుమార్‌

లవ్లీకుమార్‌

‘జై’ వచ్చి మూడు నెలలైంది. జోరుగా హల్‌చల్‌ చేశాడు.

‘జై’ వచ్చి మూడు నెలలైంది. జోరుగా హల్‌చల్‌ చేశాడు. స్టైలిష్‌గా, రఫ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. సోమవారం ‘లవ’ వచ్చాడు. స్టైలిష్‌గా ఉన్నాడు. అయితే కూల్‌గా కనిపించాడు. ఇక, ‘కుశ’ ఎలా ఉంటాడో రానున్న రోజుల్లో చూస్తాం. హీరోగా కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ‘జై’ గెటప్‌ని ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మేలో విడుదల చేశారు. ఇప్పుడు లవకుమార్‌ని చూపించారు.

వాస్తవానికి ఈ గెటప్‌కి సంబంధించి ఒక్క పోస్టర్‌ని మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. అయితే, అన్నదమ్ములు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌లకు రెండు పోస్టర్లు నచ్చాయి. ఏది రిలీజ్‌ చేస్తే బాగుంటుందా? అని ఆలోచించి.. చివరకు ఎటూ తేల్చుకోలేక అభిమానులకు డబుల్‌ ధమాకా ఇచ్చేశారు. రెండు ఫొటోలు విడుదల చేశారు. లవ అలియాస్‌ లవకుమార్‌ చాలా లవ్లీగా ఉన్నాడు కదూ! ఈ లుక్స్‌ చూసి అభిమానులు ఆనందపడిపోయారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement