జగన్నాయకుడొస్త్తున్నాడు! | 'Jagannayakudu' on Dec 19th | Sakshi
Sakshi News home page

జగన్నాయకుడొస్త్తున్నాడు!

Dec 15 2014 11:14 PM | Updated on Sep 2 2017 6:13 PM

జగన్నాయకుడొస్త్తున్నాడు!

జగన్నాయకుడొస్త్తున్నాడు!

మూడు తరాలకు చెందిన కుటుంబ కథతో పీసీ రెడ్డి దర్శకత్వంలో వీఏ పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘జగన్నాయకుడు’.

మూడు తరాలకు చెందిన కుటుంబ కథతో పీసీ రెడ్డి దర్శకత్వంలో వీఏ పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘జగన్నాయకుడు’.  రాజా, పరిణిక, మమతా రావత్ నాయకా నాయికలుగా రూపొందిన ఈ చిత్రంలో శిరీష. ఆమని, సుమన్, భానుచందర్, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్రనిర్మాత మాట్లాడుతూ - ‘‘సెన్సార్ పరంగా ఎదుర్కొన్న సమస్యల కారణంగా ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అన్ని సమస్యలఠ్టి అధిగమించాం. ఇందులో తాత, గ్రామ పెద్దగా ప్రసాద్‌బాబు, ముఖ్యమంత్రిగా భానుచందర్, ఆయన తనయుడిగా రాజా నటించారు.

కథ మీద నమ్మకంతో ఈ సినిమా తీశాం. ఎలాంటి అసభ్యతజ్టు తావు లేని ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చు’’ అని చెప్పారు. ఇందులో తనది మంచి పాత్ర అని భానుచందర్ తెలిపారు. పాటలకు మంచి ఆదరణ లభించిందనీ, చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని సంగీత దర్శకుడు ప్రమోద్‌కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న నైజాం పంపిణీదారుడు రాజేంద్ర, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి), ఛాయాగ్రాహకుడు నాగశ్రీనివాసరెడ్డి తదితరులు చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఈ చిత్రానికి మాటలు: సింహప్రసాద్, సమర్పణ: వల్లూరు శకుంతలారెడ్డి.
 

Advertisement
 
Advertisement
Advertisement