ఆ పాట రీమిక్స్‌.. అదరహో! | Jacqueline Fernandez steps Ek Do Teen remix song | Sakshi
Sakshi News home page

జాక్వలిన్‌ ఏక్‌.. దో.. తీన్‌.. అదరహో

Mar 19 2018 5:03 PM | Updated on Mar 19 2018 5:03 PM

Jacqueline Fernandez steps Ek Do Teen remix song - Sakshi

సాక్షి, ముంబై : ఆలనాటి మేటి గీతాలను రీమిక్స్‌ చేయడం ఇప్పుడు కొత్త కాదు. 80, 90వ దశకాలకు సంబంధించిన ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఇప్పటికే రీమిక్స్‌ అయి మరోసారి ప్రేక్షకులను అలరించాయి. ఇదే కోవలో తాజాగా వచ్చిన ‘ఏక్‌ దో తీన్‌’ బాలీవుడ్‌ రీమిక్స్‌ సాంగ్‌ అదరగొడుతోంది. ‘బాగీ-2’ కోసం రీమిక్స్‌ చేసిన ఈ క్లాసిక్‌ సాంగ్‌లో శ్రీలంక భామ జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ హాట్‌ హాట్‌ స్టెప్పులతో అదరగొట్టింది. శ్రేయో ఘోషల్‌ తన గాత్రంతో మరోసారి ఈ పాటకు ప్రాణంపోయగా..  జాక్వలిన్‌ హాట్‌ లుక్స్‌, స్టెప్పులతో మరింత ఊపుతెచ్చేలా నర్తించింది.

1998లో వచ్చిన ‘తేజాబ్‌’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన మాధురీ దీక్షిత్‌.. ఈ సినిమాలోని ‘ఎక్‌ దో తీన్‌’ పాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో మోహినీగా మధురీ వేసిన స్టెప్స్‌.. అప్పట్లో యువతను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ పాటను మరింత డోస్‌ పెంచి.. ‘బాగీ-2’ కోసం రీమిక్స్‌ చేశారు. ఈ పాటలో జాక్వలిన్‌ మరింత బోల్డ్‌గా.. అందచందాలను ప్రదర్శిస్తూ.. స్టెప్పులు వేయడంతో మొత్తానికి ఈ రీమిక్స్‌ కూడా సూపర్‌ హిట్‌ అని నెటిజన్లు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement