జాక్వెలిన్, సుకేశ్‌లపై అభియోగాలు నమోదు చేయండి | Jacqueline Fernandez, Sukesh Chandrasekhar to face charges in Rs 200 crore money laundering case | Sakshi
Sakshi News home page

జాక్వెలిన్, సుకేశ్‌లపై అభియోగాలు నమోదు చేయండి

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

Jacqueline Fernandez, Sukesh Chandrasekhar to face charges in Rs 200 crore money laundering case

మనీ లాండరింగ్‌ కేసులో ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు 

న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు లో మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్, బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, మరో 15మందిపై అభి యోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు శనివా రం ఆదేశించింది. నిందితులందరిపైనా ప్రాథ మికంగా బలమైన సాక్ష్యాధారాలున్నా యని అదనపు సెషన్స్‌ జడ్జి (ఏఎస్‌జే) ప్రశాంత్‌ శర్మ పేర్కొన్నారు. 

మనీ లాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 3, 4కింద వీరిపై అభియోగాలు నమోదు చేయా లన్నారు. దీంతో, ఈ కేసు విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కేసులో పలుమార్లు జాక్వెలిన్‌ను ప్రశ్నించిన ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో మొదటిసారిగా ఆమె పేరును చేర్చింది. పింకీ ఇరానీ ద్వారా సుకేశ్‌ నుంచి ఆమె ఖరీదైన బహు మతులను పొందినట్లు రెండో సప్లిమెంటరీ చార్జి షీట్‌లో పేర్కొంది. 

సుకేశ్‌ నేర కార్యకలాపాలు తెలిసిన తర్వాత కూడా అతడితో జాక్వెలిన్‌ సంబంధాలు కొనసాగించిందని, మనీలాండరింగ్‌తో ఆమెకూ సంబంధాలున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఆమె బాధితురాలు కాదని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు సుకేశ్‌ను 2017లో అరెస్ట్‌ చేయగా, 2021లో ఈడీ అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో సుకేశ్‌ భార్య లీనా, దీపక్‌ రమ్నానీ, ప్రదీప్‌ రమ్దానీ, బి. మోహన్‌రాజ్, అరుణ్‌ ముత్తు, డి.కమ్లేశ్‌ కొఠారి, పింకీ ఇరానీలతోపాటు మరికొందరు కూడా నిందితులుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement