బై.. బై సల్మాన్‌ | Iulia Vantur levies india | Sakshi
Sakshi News home page

బై.. బై సల్మాన్‌

Oct 15 2017 3:26 PM | Updated on Oct 15 2017 5:49 PM

Iulia Vantur levies india

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, రుమేనియా అందాల తార లులియా వాంటర్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ఏడాది కాలంగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. సల్లు భాయ్‌ అభిమానులు కూడా ఈ విషయం తెలిసి పండగ చేసుకున్నారు. ఇంతలో ఏమైదో ఏమో.. కొన్నాళ్లుగా ఈ జంట గురించి ఎక్కడా ఒక్కటంటే ఒక్కవార్త కూడా బయటకు రాలేదు.

ఇదిలా ఉండగా.. సల్మాన్‌ ఖాన్‌ ప్రియురాలు.. లులియా వాంటర్‌ మళ్లీ రుమేనియాకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. అయితే లులియా ఎందుకు రుమేనియా వెళ్లిందనేదానిపై స్పష్ట లేదు. ఒకరు బ్రేకప్‌ అంటే.. మరొకరు లులియా వీసా సమయం ముగిసింది..అని ఇంకొకరు అదేం లేదు షూటింగ్‌లు అని తలా ఓ మాట చెబుతున్నారు.

తాను రుమేనియా వెళ్లినట్లు లులియానే శుక్రవారం ప్రకటించారు. ఫ్లయిట్‌టలో ప్రయాణిస్తున్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి..ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే హఠాత్తుగా ఎందుకు వెళుతున్నాదీ చెప్పలేదు. కానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం చట్టాలు వల్లే వెళ్లాల్సి వస్తోంది.. వీసా గడువు ముగిసింది.. జీవితం బాగుంది.. ప్రేమను పొందాను.. అని ఫొటో కింద పోస్ట్ చేశారు.
’టైగర్‌ చిందాహై‘ చిత్రం షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ ఖాన్- మాజీ ప్రియురాలు కత్రీనా కైఫ్‌ల మధ్య మళ్లీ ప్రేమ మొగ్గతొడిగిందనే వార్తలు కొంతకాలంగా బీ టౌన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కారణం వల్లే లులియా రుమేనియా వెళ్లిపోయిందని బీ టౌన్‌ వర్గాల కథనం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement