అప్పడాల చిన్నోడు హీరో అయ్యాడు | Itlu Anjali trailer launch | Sakshi
Sakshi News home page

అప్పడాల చిన్నోడు హీరో అయ్యాడు

May 9 2019 12:08 AM | Updated on May 9 2019 12:08 AM

Itlu Anjali trailer launch - Sakshi

శుభాంగి, కార్తికేయ

‘‘ఇట్లు అంజలి’ సినిమా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన శ్రీ కార్తికేయ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా తనతో పాటు టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని శ్రీకాంత్‌ అన్నారు. శ్రీ కార్తికేయ హీరోగా, హిమాన్సీ, శుభాంగి పంత్‌ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇట్లు అంజలి’. ఓమా ప్రొడక్షన్స్‌ పతాకంపై నవీన్‌ మన్నేల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే శ్రీ కార్తికేయ చక్కని నటన కనబరచినట్లు తెలుస్తోంది. తనకు ఈ సినిమా హీరోగా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. దర్శక–నిర్మాత నవీన్‌ మన్నేల మాట్లాడుతూ– ‘‘ప్రేమలేఖ’ ఆధారంగా సాగే వైవిధ్యమైన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్స్‌ కన్నా మా సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలమ్మే కుర్రాడిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత బాలనటుడిగా చాలా సినిమాలు చేశా. హీరోగా ఇది నా తొలి సినిమా’’ అని శ్రీ కార్తికేయ అన్నారు. సంగీత దర్శకుడు కార్తీక్‌ కొడగండ్ల, హిమాన్షీ, శుభాంగి పంత్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement