అది నిజం కాదుగా అనుష్కా! | It is not true that Anushka | Sakshi
Sakshi News home page

అది నిజం కాదుగా అనుష్కా!

May 26 2015 12:10 AM | Updated on Sep 3 2017 2:40 AM

అది నిజం కాదుగా అనుష్కా!

అది నిజం కాదుగా అనుష్కా!

తనకు ఒంట్లో బాగోకపోవడం వల్ల తన కొత్త సినిమా ‘దిల్ ధడక్‌నే దో’ ప్రమోషన్‌ని మిస్ అవుతున్నానని, ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా వెళ్లలేకపోతున్నానంటూ బాలీవుడ్ నటి అనుష్కాశర్మ తాజాగా పోస్ట్ చేసిన ఓ ట్వీట్‌ను చూసి ‘అమ్మ అనుష్కా’ అంటూ అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు.

తనకు ఒంట్లో బాగోకపోవడం వల్ల తన కొత్త సినిమా ‘దిల్ ధడక్‌నే దో’ ప్రమోషన్‌ని మిస్ అవుతున్నానని, ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా వెళ్లలేకపోతున్నానంటూ బాలీవుడ్ నటి అనుష్కాశర్మ తాజాగా పోస్ట్ చేసిన ఓ ట్వీట్‌ను చూసి ‘అమ్మ అనుష్కా’ అంటూ అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇటీవలే అనుష్క హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యింది.
 
 దాంతో మూడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు. అప్పుడిచ్చింది అనుష్క ఈ ట్వీట్. మరి అందులో ఆశ్చర్యపోవలసింది ఏముందనేగా! ఉంది. అనుష్క ఐపీఎల్ చూడ్డానికి వెళ్లకపోవడానికి కారణం అనారోగ్యం కాదు. మొన్న ఓరోజు మ్యాచ్ బ్రేక్‌లో విరాట్ కోహ్లీ గాళ్‌ఫ్రెండ్ అనుష్కతో ఏకాంతంగా కబుర్లాడుతూ అధికారులకు దొరికిపోయాడు.
 
 అలా చేయడం రూల్స్‌కి వ్యతిరేకం కాబట్టి అధికారులు గుస్సా అయ్యి, విరాట్ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. విరాట్ కెరీర్‌ని అనుష్క పాడు చేస్తోందంటూ మీడియాలో వార్తలు సైతం ప్రచురితమయ్యాయి. దాంతో తప్పనిసరై అనుష్క ఆ మ్యాచ్‌లకు దూరంగా ఉంది తప్ప అనారోగ్యం కారణంగా కాదు. అదీ అసలు సంగతి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement