అదేం కష్టం కాదు! | It is not difficult says Kratina Kaif | Sakshi
Sakshi News home page

అదేం కష్టం కాదు!

Mar 31 2015 10:54 PM | Updated on Apr 3 2019 6:23 PM

అదేం కష్టం కాదు! - Sakshi

అదేం కష్టం కాదు!

రెండు భిన్న మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం కష్టమని చాలామంది అనుకుంటారు.

‘‘రెండు భిన్న మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం కష్టమని చాలామంది అనుకుంటారు. కానీ, కష్టమేం కాదని నేనంటాను. అందుకు నిదర్శనం నా కుటుంబమే. మా అమ్మగారు క్రిస్టియన్, నాన్నగారు ముస్లిమ్. మా అమ్మా, నాన్నల వైవాహిక జీవితం ఇతరులు ఆదర్శంగా తీసుకునేంత ఆనందంగా ఉంటుంది. మా ఇంట్లో అసలు కుల, మతాల ప్రసక్తే రాదు. నేను చర్చ్‌కి వెళతాను. మసీదులకూ వెళతాను. హిందూ దేవాలయాలనూ సందర్శిస్తాను. అంతెందుకు మా ఇంట్లో పూజా మందిరం కూడా ఉంది. నేను రోజూ పూజలు చేయను కానీ, అప్పుడప్పుడు దీపం వెలిగిస్తా. ఎవరైనా ‘నువ్వేంటి దీపాలు వెలిగిస్తున్నావ్?’ అనడిగితే.. ‘నాకు లేని అభ్యంతరం మీకెందుకు?’ అంటాను. దేవుళ్లందరూ సమానమనే భావన నాది. నా అభిప్రాయంతో కొంతమంది ఏకీభవించకపోవచ్చు. కానీ, ఎవరి అభిప్రాయం వారిది.. ఎవరి నమ్మకం వారిది.’’
 - క్రతినా కైఫ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement