నాకు నచ్చిన హారర్ సినిమా ఇది - సిరివెన్నెల | It is my favorite horror film : sirivennela sitarama sastry | Sakshi
Sakshi News home page

నాకు నచ్చిన హారర్ సినిమా ఇది - సిరివెన్నెల

Feb 5 2014 12:38 AM | Updated on Sep 2 2017 3:20 AM

నాకు నచ్చిన హారర్ సినిమా ఇది - సిరివెన్నెల

నాకు నచ్చిన హారర్ సినిమా ఇది - సిరివెన్నెల

ఇప్పటివరకూ నేను చూసిన హారర్ చిత్రాల్లో ఓ హాలీవుడ్ సినిమా మాత్రమే నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత నాకు నచ్చిన హారర్ చిత్రం ఇదే.

 ‘‘ఇప్పటివరకూ నేను చూసిన హారర్ చిత్రాల్లో ఓ హాలీవుడ్ సినిమా మాత్రమే నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత నాకు నచ్చిన హారర్ చిత్రం ఇదే. ఈ చిత్ర నిర్మాత అంకమ్మచౌదరి చాలా విలువలున్న వ్యక్తి’’ అని ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. తారకరత్న, అనూప్‌తేజ్, పంచిబోర, లాస్య ముఖ్య తారలుగా వెంకటరమణ సాళ్వ దర్శకత్వంలో ముప్పా తిరుమలరావు చౌదరి సమర్పణలో అంకమ్మ చౌదరి నిర్మించిన ‘యామిని చంద్రశేఖర్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. యోగీశ్వరశర్మ స్వరపరిచిన ఈ సినిమా పాటల సీడీని సీతారామశాస్త్రి ఆవిష్కరించగా, చాట్ల శ్రీరాములు స్వీకరించారు. ప్రేమ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ చిత్రం ఇదని దర్శకుడు పేర్కొన్నారు. చేసే పనిలో నిబద్ధత ఉండాలనే సూత్రంతో ఈ చిత్రానికి పనిచేశామని నిర్మాత చెప్పారు. భీమనేని, టి.ప్రసన్నకుమార్, చంద్రసిద్దార్థ్, రాజా, సాయికిరణ్, అడివి శేష్ పంచిబోర తదితరులు కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement