జర్నలిస్ట్ ఏం చేశాడు? | ISM movie release on 21st | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్ ఏం చేశాడు?

Oct 10 2016 11:08 PM | Updated on Mar 22 2019 1:53 PM

జర్నలిస్ట్ ఏం చేశాడు? - Sakshi

జర్నలిస్ట్ ఏం చేశాడు?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’. ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘‘వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రమిది. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ, సోషల్ హ్యాకింగ్ గ్రూప్ ‘అనానిమస్’ వ్యవస్థల నేపథ్యంలో పూరి చిత్రాన్ని అద్భుతంగా మలిచారు.

ఓ జర్నలిస్టుకి, ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ వ్యవస్థలకు సంబంధం ఏంటి? అతనేం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ సిక్స్‌ప్యాక్ చేశారు. ఆయన లుక్, యాక్టింగ్ స్టైలిష్‌గా ఉంటాయి’’ అని పూరి అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement