'ఆమె నాకు రోల్ మోడల్' | ishwarya Rai Bachchan my idol, says Scarlett Wilson | Sakshi
Sakshi News home page

'ఆమె నాకు రోల్ మోడల్'

Sep 15 2015 5:12 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఆమె నాకు రోల్ మోడల్' - Sakshi

'ఆమె నాకు రోల్ మోడల్'

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తనకు రోల్ మోడల్ అని బ్రిటన్ మోడల్, డాన్సర్ స్కార్లెట్ విల్సన్ అన్నది.

ముంబయి : బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తనకు రోల్ మోడల్ అని బ్రిటన్ మోడల్, డాన్సర్ స్కార్లెట్ విల్సన్ అన్నది. టీవీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ అమ్మడికి మన ఐష్ అంటే చాలా ఇష్టమంటోంది. ఆమె డ్యాన్స్ చాలా బాగుంటుందని, ఇరవై ఆరేళ్ల మోడల్ పేర్కొంటోంది. సెలబ్రిటీల డ్యాన్స్ షోలతో స్కార్లెట్ ప్రస్తుతం బిజీగా ఉంది. 'దేవదాస్' మూవీలో ఐష్ డ్యాన్స్ మాత్రమే కాదు ఆమె ఫేస్ ఎక్స్ప్రేషన్స్ చాలా గొప్పగా ఉంటాయని 'ఝలక్ దిక్లా జా' లో పాల్గొన్న ఈ బ్రిటన్ భామ చెప్పుకొచ్చింది.

టాలీవుడ్, బాలీవుడ్ మూవీలలో స్కార్లెట్ పలు ఐటెమ్ సాంగ్స్ చేసిన విషయం విదితమే. కరణ్ జోహార్ లాంటి గొప్పవాళ్లు తనను గుర్తించాలని, ఇండియన్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేయడం చాలా కష్టమని చెప్పింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న డ్యాన్సర్ భావిస్తోంది. ఐష్ తరహాలో తాను అంత గొప్ప డ్యాన్సర్ కాదని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement