'ట్రిపుల్‌ ఎక్స్‌' సిరీస్‌లో దీపిక నటించనుందా? | Is Deepika Padukone working with Vin Diesel in 'XXX'? | Sakshi
Sakshi News home page

'ట్రిపుల్‌ ఎక్స్‌' సిరీస్‌లో దీపిక నటించనుందా?

Dec 6 2015 4:23 PM | Updated on Sep 3 2017 1:36 PM

బాలీవుడ్ నటి దీపికా పదుకొణే తాజాగా చేసిన ట్వీట్‌ హల్‌చల్‌ చేస్తోంది.

బాలీవుడ్ నటి దీపికా పదుకొణే తాజాగా చేసిన ట్వీట్‌ హల్‌చల్‌ చేస్తోంది. 'ట్రిపుల్‌ ఎక్స్‌' సిరీస్‌లో వస్తున్న తదుపరి చిత్రం 'జాండర్‌ కేజ్‌ రిటర్న్స్'లో తాను నటించనున్నట్టు ఆమె సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు 'ట్రిపుల్‌ ఎక్స్‌' హీరో విన్‌ డీసెల్‌తో ఆమె ఓ ఫొటో దిగి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి ఇతర సోషల్ వెబ్‌సైట్లలోనూ ఈ ఫొటోను పెట్టి 'విన్‌ డిసెల్' అంటూ నటుడి పేరును రాసింది. ఈ ఫొటోలో వారి వెనుక సినిమా లోగో అయిన 'ట్రిపుల్‌ ఎక్స్' ఉండటం గమనార్హం.

నిజానికి 2014లో హాలీవుడ్ స్టార్ డిసెల్‌ నటించిన 'ఫాస్ట్‌ అండ్ ఫ్యూరియస్‌-7' సినిమా ఆఫర్‌ దీపికకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాకు డేట్లు సరిపోకపోవడంతో ఈ ఆఫర్‌ను ఆమె వదులుకున్నట్టు అప్పట్లో భావించారు. అమెరికా యాక్షన్ థ్రిల్లర్ అయిన 'ట్రిపుల్‌ ఎక్స్' సినిమా మొదట 2002లో విడుదలైంది. ఈ సినిమాలో జాండర్ కేజ్‌ పాత్రలో సాహసోపేతమైన క్రీడాకారుడిగా, రెబెల్‌ గూఢచారిగా డిసెల్‌ నటించాడు. అప్పటినుంచి ఈ సీరిస్‌లో సినిమాలు వస్తూనే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement