‘మూడు ఆత్మలు, రెండు శవాలు..’ | Irfan Khan And Dulquer Salmaan Movie Karwaan First Look Release On 27th June | Sakshi
Sakshi News home page

Jun 26 2018 3:59 PM | Updated on Jun 26 2018 7:10 PM

Irfan Khan And Dulquer Salmaan Movie Karwaan First Look Release On 27th June - Sakshi

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌, మాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌లు కలిసి చేస్తోన్న చిత్రం కర్మాన్‌. ఈ మధ్యే బ్లాక్‌ మెయిల్‌, హిందీ మీడియమ్‌ చిత్రాలతో సక్సెస్‌ సాధించారు. హిందీ మీడియమ్‌ సినిమా చైనాలో కూడా విజయవంతమైంది. 

మహానటి సినిమాతో తెలుగు, తమిళ్‌లో కూడా ఫేమస్‌ అయిన దుల్కర్‌ సల్మాన్‌ గతవారం ‘అతడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. మహానటి తెచ్చిన గుర్తింపుతో ఇక్కడ కూడా తన మార్కెట్‌ పెరిగింది. దుల్కర్‌, ఇర్ఫాన్‌లు లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ‘కర్వాన్‌’ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించారు. ‘మూడు ఆత్మలు, రెండు శవాలు.. ఓ జీవిత కాలపు ప్రయాణం’ అంటూ విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 3న విడుదలకానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement