విచిత్ర సంఘటనలు ఎదురైతే..?

విచిత్ర సంఘటనలు ఎదురైతే..?


 ప్రస్తుత కాలంలో పెద్దల మీద కన్నా, పిల్లలపైనే ఒత్తిడి ఎక్కువ ఉంటోంది. ఈ ఒత్తిడి ఫలితంగా చాలా అయోమయానికి గురవుతున్నారు వాళ్లు. అలాంటి అయోమయంలో ఉన్న ఎనిమిదేళ్ల పిల్లాడికి కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురైతే, ఆ పిల్లాడు ఏం చేస్తాడు? ఆ పిల్లాడి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఈ నేపథ్యంలో ‘బుడుగు’ చిత్రం రూపొందుతోంది. మంచు లక్ష్మీ, శ్రీధర్‌రావ్, మాస్టర్ ప్రేమ్‌బాబు, ఇందు ఆనంద్, సన ఇందులో ముఖ్యతారలు. ఇంద్రజ ప్రత్యేక పాత్రలో నటించారు.

 

  మన్మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారిక శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘యధార్థ సంఘటనలతో రూపొందిస్తున్న సైక లాజికల్ థ్రిల్లర్ ఇది. సైకాలజిస్ట్‌ల సలహాలు తీసుకుని స్క్రిప్ట్ తయారు చేశాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పూలూరి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top