'భారతీయ మహిళల కళ్లు అందంగా ఉంటాయి' | Indian women have most beautiful eyes: Athiya | Sakshi
Sakshi News home page

'భారతీయ మహిళల కళ్లు అందంగా ఉంటాయి'

Jan 1 2016 6:23 PM | Updated on Sep 3 2017 2:55 PM

'భారతీయ మహిళల కళ్లు అందంగా ఉంటాయి'

'భారతీయ మహిళల కళ్లు అందంగా ఉంటాయి'

భారతీయ మహిళల కళ్లు ఎంతో అందంగా, చక్కని ఆకృతిలో ఉంటాయని బాలీవుడ్ నటి అతియా శెట్టి చెప్పింది.

న్యూఢిల్లీ: భారతీయ మహిళల కళ్లు ఎంతో అందంగా, చక్కని ఆకృతిలో ఉంటాయని బాలీవుడ్ నటి అతియా శెట్టి చెప్పింది. కళ్లు పెద్దవిగా, మంచి ఆకారంలో ఉంటాయని అంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతియా శెట్టి తన సౌందర్య రహస్యాన్ని వెల్లడించింది.

షూటింగ్ లేనప్పుడు తాను మేకప్ ఎక్కువగా వేసుకోనని చెప్పింది. చాలా తక్కువగా మేకప్ సామాగ్రిని వాడుతానని అంది. ఇప్పటికీ ప్రతి ఆదివారం బామ్మ తన తలకు కొబ్బరినూనె రాస్తుందని తెలిపింది. తన శిరోజాల రహస్యమిదేనని చెప్పింది. అతియా నటించిన బాలీవుడ్ చిత్రం హీరో గత సెప్టెంబర్లో విడుదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement