చెల్లెమ్మా.. ఇదిగో ప్రతీకారం!

indian celebrities tweet about indian army surgical strikes - Sakshi

చెల్లెమ్మా! ఇదిగో ప్రతీకారం నీ సింధూరాన్ని చెరిపిన దుర్మార్గులను  పన్నెండవ రోజు వేకువ సింధూరం కనపడకముందే పిండప్రదానానికి ముష్కరుల రక్తప్రదానం చేశాము ఎరుపెక్కిన నీ కన్నీటి కళ్లకు ప్రతీకారంగా ఆకాశాన్ని ఆ దుర్మార్గుల రక్తంతో దిద్దాము నీ గుండెఘోష చల్లారకముందే వెయ్యికిలోల బాంబులు వాళ్ల విషకడుపులో కుక్కాము నువ్వు పోగొట్టుకున్నదానిని తిరిగి తేలేము కానీ ఈ దేశం... నీ దేశం అని..  మేమంతా నీ కుటుంబమని... నువ్వు అనాథవు కావని.. నీ కన్నీరు వృథా కాదని... నీ భర్త త్యాగం వ్యర్థం కాదని...  దేశమంతా ఒక్కటై.. నీతో ఒక్కటై గర్జించింది... చెల్లెమ్మా! ఇదిగో ప్రతీకారం!

బ్రేవో  ఇండియా. – రజనీకాంత్‌

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు పెద్ద సెల్యూట్‌. జైహింద్‌.  – ప్రభాస్‌

ఇండియన్‌  ఎయిర్‌ ఫోర్స్‌  జయహో.  – సల్మాన్‌ ఖాన్‌

మన దేశం సరైన సమాధానం ఇచ్చింది. ఎయిర్‌ఫోర్స్‌కు నా సెల్యూట్‌.– ఎన్టీఆర్‌

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చేసిన పనికి గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. జైహింద్‌ – రామ్‌చరణ్‌

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌... మీకు సెల్యూట్‌ చేస్తున్నాం. దేశం గర్వించే రోజు ఇది.–అఖిల్‌ అక్కినేని 

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కి సెల్యూట్‌ చేస్తున్నా. – సోనాక్షి సిన్హా

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కి దేశం యావత్తూ సెల్యూట్‌ చేస్తోంది.– రకుల్‌ ప్రీత్‌

టెర్రరిస్ట్‌ క్యాంపులను సమూలంగా నాశనం చేసిన మన 12 మంది సైనికులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆ హీరోలను చూసి దేశం గర్విస్తుంది. వారి ధైర్యానికి సెల్యూట్‌ చేస్తున్నాను – కమల్‌హాసన్‌ 

మా చెంప మీద కొడితే మరో చెంప చూపించబోము. దాని బదులు మీ కాలర్‌ను పట్టుకొని చితకబాదేస్తాం. అందుకే.. మాతో పెట్టుకోవాలంటే మరోసారి ఆలోచించండి. – చేతన్‌ భగత్‌

ఉగ్రవాదులను హతమార్చడం అంటే భవిష్యత్‌లో ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడటమే. సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలను భస్మీపటలం చేసిన భారత వైమానిక దళానికి సెల్యూట్‌ చేస్తున్నా.– ప్రీతీజింతా

టెర్రరిస్టు శిబిరాలపై దాడులు చేసిన మన భారతీయ వైమానిక దళ వీరులను చూసి గర్వపడుతున్నా. అందర్‌ ఘుస్‌కే మారో (చొచ్చుకెళ్ళి హతమార్చండి) – అక్షయ్‌ కుమార్‌

యాద్‌ రహే నామ్‌ నమక్‌ ఔర్‌ నిషాన్‌ మర్చిపోవద్దంటూ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కీ, నాయకుడూ సుప్రీం కమాండర్‌ అయిన ప్రధాని నరేంద్రమోదీకి సెల్యూట్‌ చేస్తున్నాను. జైహింద్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ 2, టెర్రరిజాన్ని అంతం చేయాలి.– సెలీనా జైట్లీ

భారత వైమానిక సైన్యం నాకు గర్వకారణం. సాహసోపేత చర్యకి సెల్యూట్‌ చేస్తున్నా.  – తమన్నా

జాతీయ జెండాకి సెల్యూట్‌ చేస్తున్నాను – అభిషేక్‌ బచన్‌

భారత సైన్యం మాకు గర్వకారణం. ఇండియా స్టైక్‌ బ్యాక్‌. జైహింద్‌ – సోనూ సూద్‌

తీవ్రవాదంపై భారత సైన్యం దాడికి హ్యాట్సాఫ్‌. ప్రతి భారతీయుడూ గర్వపడతారు. – కిదాంబి శ్రీకాంత్‌

మన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ను చూసి గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ధైర్య సాహసాలు చూపించిన ఫైలెట్స్‌కు సెల్యూట్‌.    – మహేశ్‌బాబు

‘ద బాయ్స్‌ హావ్‌ ప్లేడ్‌ రియల్లీ వెల్‌’ (మన వాళ్ళు బ్రçహ్మాండంగా ఆడారు)  ‘మీరు (పాక్‌) మారండి లేదంటే మేమే మారుస్తాం’           – వీరేంద్ర సెహ్వాగ్‌

మంచితనాన్ని చేతకానితనంగా ఎప్పుడూ ఊహించుకో కూడదు. మన ఎయిర్‌ ఫోర్స్‌కు సెల్యూట్‌ చేస్తున్నాను.     – సచిన్‌ టెండుల్కర్‌

టెర్రరిజానికి అవసరమైన మెసేజ్‌ పంపింది మన ఎయిర్‌ఫోర్స్‌. బ్రేవో ఎయిర్‌ ఫోర్స్‌. గర్వంగా ఫీల్‌ అవుతున్నాం. జై హింద్‌.    – అజింక్యా రెహానే

భారత వైమానిక దళ గొప్పతనానికి సెల్యూట్‌ చేస్తున్నా.– మహమ్మద్‌ కైఫ్‌ 

ఇండియా స్ట్రైక్‌ బ్యాక్, భారత వైమానిక దళానికి బిగ్‌ సెల్యూట్‌.– సైనా నెహ్వల్‌

ఆçహ్లాదకరమైన శుభోదయం. మన సైన్యం దిటవు గుండెలకు జయహో. – పరేష్‌ రావెల్‌

ఇండియా తిరిగి కొట్టింది. తిప్పి కొట్టింది. జై హింద్‌ ఐఏఎఫ్‌. – గౌతం గంభీర్‌

సమయానుకూలంగా స్పందించిన భారతీయ వైమానికదళ ధీరుల సాహసచర్యకు నా  సెల్యూట్‌. – శిఖర్‌ దావన్‌

సాహో సర్జికల్‌ స్ట్రైక్స్‌... ప్రధాని మోడీకి సెల్యూట్‌ చేయడం ప్రారంభించడానికి ఇదే మంచి రోజు. – అనుపమ్‌ ఖేర్‌

మన ఎయిర్‌ఫోర్స్‌ను చూసి ఎంతో గర్విస్తున్నాను. సెల్యూట్‌ ఐఏఎఫ్‌. జైహింద్‌.– యువరాజ్‌ సింగ్‌

మన వైమానిక దళాన్ని చూసి గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. సెల్యూట్‌ ఐఏఫ్‌.  జై హింద్‌.    – మాధురీ దీక్షిత్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top