ఆస్కార్‌ ఆశలు గల్లంతు! | India Entry Village Rockstars Out Of Oscars 2018 Race | Sakshi
Sakshi News home page

Dec 20 2018 12:33 PM | Updated on Dec 20 2018 12:33 PM

India Entry Village Rockstars Out Of Oscars 2018 Race - Sakshi

ఈ ఏడాది కూడా ఇండియన్‌ సినిమాకు ఆస్కార్‌ ఆశలు లేనట్టే. ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్‌ తరుపున బరిలో నిలిచిన విలేజ్‌ రాక్‌స్టార్‌ సినిమా ఫైనల్‌ లిస్ట్‌లో స్థానం సంపాదించలేకపోయింది. 2019 ఫిబ్రవరి 24న 91వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఈపోటిలో పాల్గోనేందుకు భారత్ తరుపున 29 సినిమాలను చూసిన ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు ఫైనల్‌గా విలేజ్‌ రాక్‌స్టార్స్‌ను పోటికి ఎంపిక చేశారు.

2017లో రిలీజ్‌ అయిన విలేజ్‌ రాక్‌స్టార్స్‌ సినిమాను రీమాదాస్ తెరకెక్కించారు. పరిమిత వనురులతో తన సొంత రాష్ట్రం అసోం లోనే లో బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. దీంతో భారత్‌ తరుపున ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు విలేజ్‌ రాక్‌స్టార్స్‌ను ఎంపిక చేశారు. కానీ సినిమా కూడా ఫైనల్‌ లిస్ట్‌ లో స్థానం సాదించలేకపోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement