హైదరాబాద్‌లో ఫస్ట్‌ టైమ్‌! | Illayaraja live concert on November 5 in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఫస్ట్‌ టైమ్‌!

Nov 5 2017 12:30 AM | Updated on Nov 5 2017 12:30 AM

Illayaraja live concert on November 5 in Hyderabad  - Sakshi

ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘స్వరజ్ఞాని’ ఇళయరాజా లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ జరుగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన  మొట్ట మెదటిసారిగా ఇస్తున్న లైవ్‌ కన్సర్ట్‌ ఇది. ఈ ఈవెంట్‌ విశేషాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇళయరాజా పాల్గొన్నారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో కలిసి ఈవెంట్‌ టికెట్స్‌ను లాంచ్‌ చేశారాయన. టెంపుల్‌ బెల్‌ ఈవెంట్స్‌ అండ్‌ మీడియా మేనేజ్‌మెంట్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ– ‘‘నేను ఇంతవరకు హైదరాబాద్‌లో పర్ఫార్మెన్స్‌ చేయలేదు.

ఇక్కడ ఫస్ట్‌ౖ టెమ్‌ పర్ఫార్మ్‌ చేయడానికి ఆసక్తికరంగా ఎదరుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఇళయరాజాగారి కంపోజిషన్స్‌కి బిగ్‌ ఫ్యాన్స్‌ మేము. హైదరాబాద్‌లో ఆయన పర్ఫార్మెన్స్‌ చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఇక్కడ ఇళయరాజాగారి ఫస్ట్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ను కండక్ట్‌ చేసే అవకాశం మాకు వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. సంగీతప్రియులకు ఈ ఈవెంట్‌ ఒక గ్రేట్‌ ట్రీట్‌’’అని టెంపుల్‌బెల్‌ ఈవెంట్స్‌ ఛీప్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ జి. సందీప్‌ తెలిపారు. ఈ ఈవెంట్‌లో 80 మంది మ్యూజిషియన్స్‌తో ఆర్కెస్ట్రా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement