గోవా బ్యూటి వేదాంతం | Ileana Philosophy | Sakshi
Sakshi News home page

గోవా బ్యూటి వేదాంతం

Aug 4 2016 12:58 PM | Updated on Sep 4 2017 7:50 AM

గోవా బ్యూటి వేదాంతం

గోవా బ్యూటి వేదాంతం

అసలే అవకాశాల్లేక కష్టాల్లో ఉన్న గోవా బ్యూటి ఇలియానా.. లైమ్ లైట్లో ఉండేందుకు సోషల్ మీడియానే నమ్ముకుంటోంది. ఇప్పటికే హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తున్న ఈ బ్యూటి తాజాగా వేదాంతం చెపుతోంది. ప్రస్తుతం రిలీజ్కు...

అసలే అవకాశాల్లేక కష్టాల్లో ఉన్న గోవా బ్యూటి ఇలియానా.. లైమ్ లైట్లో ఉండేందుకు సోషల్ మీడియానే నమ్ముకుంటోంది. ఇప్పటికే హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తున్న ఈ బ్యూటి తాజాగా వేదాంతం చెపుతోంది. ప్రస్తుతం రిలీజ్కు రెడీ అవుతున్న రుస్తుం సినిమా మీద ఆశలు పెట్టుకున్న ఇలియానా.. సినిమా ప్రమోషన్తో పాటు తన వ్యక్తిగత ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంటోంది.

ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇలియానా తను ప్రేమ విఫలమైతే.. ఆ వ్యక్తితో ఇంకెప్పటికీ మాట్లాడనని చెప్పింది. అంతేకాదు.. 'నాకు దేవుడి మీద నమ్మకం లేదు.. ఎక్కడో.. ఉన్న అదృష్య శక్తి మనల్ని నడిపిస్తోంది అంటే, నమ్మడం నాకు నచ్చదు.. అయితే అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే' అంటూ తేల్చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement