నేను మిస్‌ఫిట్‌! | Ileana D'Cruz says 'Raid' co-star Ajay Devgn is one of the easiest to work with | Sakshi
Sakshi News home page

నేను మిస్‌ఫిట్‌!

Jan 28 2018 1:36 AM | Updated on Jan 28 2018 1:36 AM

Ileana D'Cruz says 'Raid' co-star Ajay Devgn is one of the easiest to work with - Sakshi

ఇలియనా.. ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కనిపించి చాలాకాలం అయింది. ఆమె నటించిన లాస్ట్‌ సినిమా పూరీ జగన్నా«థ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’. ‘బర్ఫీ’తో బాలీవుడ్‌కి వెళ్లి, అక్కడ కూడా పెద్దగా సినిమాలు చేయడంలేదు. ఏడాదికి ఒక సినిమా చేస్తూ రిలాక్స్‌ అవుతున్నారు. ఇటు తెలుగుకి దూరమై అటు హిందీ సినిమాలు చేస్తున్నారు కాబట్టి బాలీవుడ్‌ బాగా నచ్చిందన్నది కొందరి ఊహ. ‘‘నచ్చింది కానీ నేను బాలీవుడ్‌కు ‘మిస్‌ ఫిట్‌’’ అని ఓ సందర్భంలో ఇలియానా పేర్కొన్నారు.

ఎందుకలా అన్నారనే సీక్రెట్‌ని ఆమె బయట పెట్టలేదు. నంబర్‌ గేమ్స్‌ గురించి మాట్లాడుతూ – ‘‘నాకీ నంబర్‌ గేమ్స్‌ అంటే చిరాకు. ఈ రేసులో నేనెప్పుడూ పరిగెత్తలేదు. నంబర్‌ వన్‌ కావాలంటే ఏం చేయాలో కూడా నాకు తెలియదు. అయినా ‘నంబర్‌ వన్‌’ అని ఎలా డిసైడ్‌ చేస్తారు?. ఒక్కో సినిమాకి నేను గ్యాప్‌ తీసుకుంటున్నాను. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే కంటెంట్‌ ఉన్న సినిమాలే చేస్తున్నాను. అవి సక్సెస్‌ అవుతున్నాయి.  హ్యాపీగా ఉంది’’ అన్నారు ఇలియానా. ప్రస్తుతం అజయ్‌ దేవగన్‌ ‘రెయిడ్‌’ సినిమాలో నటిసున్నారామె.

Advertisement
 
Advertisement
Advertisement