కూల్‌గా భయపెట్టే... | Ice Cream to be released on Table Profit | Sakshi
Sakshi News home page

కూల్‌గా భయపెట్టే...

Jul 7 2014 10:55 PM | Updated on Sep 2 2017 9:57 AM

కూల్‌గా భయపెట్టే...

కూల్‌గా భయపెట్టే...

‘‘నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా ‘ఐస్‌క్రీమ్’. కూల్‌గా భయపెట్టే సినిమా ఇది. ఫ్లోకేమ్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుంది’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు.

‘‘నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా ‘ఐస్‌క్రీమ్’. కూల్‌గా భయపెట్టే సినిమా ఇది. ఫ్లోకేమ్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుంది’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. నవదీప్, తేజస్వి జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన హారర్ చిత్రం ‘ఐస్‌క్రీమ్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ప్రద్యోతన్ స్వరపరచిన ఈ చిత్రం థీమ్‌సాంగ్‌ని హైదరాబాద్‌లో నవదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ నెల 11న టేబుల్ ప్రాఫిట్‌తో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించడం పట్ల నవదీప్, తేజస్వి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement