మెస్సీ ఆడేటపుడు మాత్రమే: విద్యాబాలన్ | Sakshi
Sakshi News home page

మెస్సీ ఆడేటపుడు మాత్రమే: విద్యాబాలన్

Published Sun, Jun 29 2014 5:09 PM

మెస్సీ ఆడేటపుడు మాత్రమే: విద్యాబాలన్ - Sakshi

ముంబై: సగటు అభిమానుల నుంచి క్రీడాకారులు, సినీ తారల వరకు ఫుట్బాల్ను అమితంగా ఇష్టపడతారు. బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్కు కూడా ఫుట్బాల్ అంటే ఇష్టమట. అయితే అర్టెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఆడేటపుడు మాత్రమే ఫుట్బాల్ ఆటను చూస్తానని ఈ భామ చెబుతోంది.

'ఫుట్బాల్ ఆటగాళ్లలో మెస్సీ అంటే ఇష్టం. అతను ఆకట్టుకునేలా ఉంటాడు. మెస్సీ మ్యాచ్ టీవీలో వస్తున్నప్పుడు నా స్నేహితులు చెబుతారు. వెంటనే టీవీ ఆన్ చేసి ఫుట్బాల్ చూస్తా. ఇంతకంటే పెద్దగా ఆసక్తి లేదు' అని విద్యా చెప్పింది.

Advertisement
 
Advertisement
 
Advertisement