విలన్ పాత్ర చేద్దామనుకున్నా: హృతిక్ | I wanted to play the villain in 'Krrish 3': Hrithik Roshan | Sakshi
Sakshi News home page

విలన్ పాత్ర చేద్దామనుకున్నా: హృతిక్

Oct 28 2013 9:09 PM | Updated on Sep 2 2017 12:04 AM

విలన్ పాత్ర చేద్దామనుకున్నా: హృతిక్

విలన్ పాత్ర చేద్దామనుకున్నా: హృతిక్

సోషియా ఫాంటసీ సినిమా 'క్రిస్ 3'లో సూపర్ హీరో పాత్ర పోషించిన హృతిక్ రోషన్ విలన్ క్యారెక్టర్లో నటించాలనుకున్నాడట.

ఇండోర్: సోషియా ఫాంటసీ సినిమా 'క్రిస్ 3'లో సూపర్ హీరో పాత్ర పోషించిన హృతిక్ రోషన్ విలన్ క్యారెక్టర్లో నటించాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ సినిమాలో విలన్ వేషం వేయాలకున్నానని, కానీ తన తండ్రి రాకేష్ రోషన్ అందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. ఈ పాత్రను వివేక్ ఒబరాయ్తో చేయించారని చెప్పాడు.

తన తండ్రి నమ్మకాన్ని వివేక్ వమ్ము చేయలేదని అన్నాడు. 'కాల్' పాత్రలో వివేక్ నటన చూసిన తర్వాత తన తండ్రి తీసుకున్న నిర్ణయం కరెక్టని అనిపించిందని హృతిక్ వివరించాడు. ఇండోర్లో 'క్రిస్ 3' ప్రమోషన్ కార్యక్రమంలో హృతిక్, రాకేష్ రోషన్  పాల్గొన్నారు. నవంబర్ 1న 'క్రిస్ 3' చిత్రం విడుదలకానుంది.

Advertisement
 
Advertisement
Advertisement