అలా అయితేనే సపోర్ట్ చేస్తా: ఆమిర్‌ ఖాన్‌ | i help my children enter films only if they are deserving says aamir khan | Sakshi
Sakshi News home page

అలా అయితేనే సపోర్ట్ చేస్తా: ఆమిర్‌ ఖాన్‌

Dec 17 2016 11:17 AM | Updated on Aug 9 2018 7:30 PM

అలా అయితేనే సపోర్ట్ చేస్తా: ఆమిర్‌ ఖాన్‌ - Sakshi

అలా అయితేనే సపోర్ట్ చేస్తా: ఆమిర్‌ ఖాన్‌

బాలీవుడ్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ సినిమాల విషయంలోనే కాదు తన పిల్లల విషయంలోనూ అలాగే ఉంటానంటున్నాడు

ముంబై: బాలీవుడ్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ సినిమాల విషయంలోనే కాదు తన పిల్లల విషయంలోనూ అలాగే ఉంటానంటున్నాడు. తన పిల్లలు సినిమాల్లోకి రావాలనుకున్నంత మాత్రాన సహాయం చేయనని, వారు దానికి అర్హులు అని తాను భావించినప్పుడే సపోర్ట్ చేస్తానని ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ఆమిర్‌ స్పష్టం చేశాడు.

ఆమిర్‌కు మొదటి భార్య రీనా దత్తాతో ఇద్దరు పిల్లలు.. జునైద్‌, ఇరాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా జునైద్‌ ఇప్పటికే సినీ రంగం వైపు అడుగులేస్తూ.. తండ్రి నటించిన పీకే సినిమాకు.. దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి వద్ద అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాడు. జునైద్‌ థియెటర్‌కు సంబంధించి అధ్యయనం చేస్తున్నాడని.. అయితే ఇరా మాత్రం అలాంటి ప్లాన్‌లేమీ లేకుండా తన బాటలో నడుస్తోందని ఆమిర్‌ అన్నాడు. టాలెంట్‌ ఉంటే వారిని తప్పకుండా సినీరంగం వైపు ఎంకరేజ్‌ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement