ఆ పేరుతో నన్ను పిలవొద్దు: హీరోయిన్ | I don't want any association with my old name 'Madhuurima' | Sakshi
Sakshi News home page

ఆ పేరుతో నన్ను పిలవొద్దు: హీరోయిన్

May 11 2016 3:10 PM | Updated on Apr 3 2019 6:34 PM

ఆ పేరుతో నన్ను పిలవొద్దు: హీరోయిన్ - Sakshi

ఆ పేరుతో నన్ను పిలవొద్దు: హీరోయిన్

అవకాశాలు తగ్గడం వల్లే పేరు మార్చుకుందన్న వాదనలను మధురిమ తోసిపుచ్చింది.

హీరోయిన్ మధురిమ పేరు మార్చుకుంది. ఇక నుంచి తన పేరు నిరా అని చెప్పింది. అవకాశాలు తగ్గడం వల్లే పేరు మార్చుకుందన్న వాదనలను ఆమె తోసిపుచ్చింది. తన పేరు మార్చుకోవడానికి గల కారణాలను వెల్లడించింది.

'నిరా అనేది నా ముద్దు పేరు. మధురిమ నా అఫీషియల్ నేమ్. తెరపై కూడా ఇదే పేరుతో నటించా. అయితే మధురిమ పేరుతో మరో నటి(తులి) ఉండడంతో గందరగోళం ఏర్పడింది. ఒకసారి నా ఇంటర్వ్యూను ఆమె ఫొటోలతో ప్రచురించారు. ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్స్ ఉండడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో నా తెర పేరును మార్చుకోవాల్సి వచ్చింది. నా పాత పేరు మధురిమతో ఇక ఎటువంటి సంబంధం ఉండకూదని అనుకుంటున్నా. అందరూ నన్ను నిరా అని పిలవడం అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను' అని మధురిమ వివరించింది.

తెలుగులో తనకు సరైన విజయాలు దక్కలేదని తెలిపింది. అందుకే బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నానని చెప్పింది. పేరు మార్పుతో కెరీర్ ఊపందుకుంటుందని భావిస్తున్నానని అంది. 'ఆ ఒక్కడు'తో తెలుగు తెరకు పరిచయమైన మధురిమ సరదాగా కాసేపు, ఆరెంజ్, షాడో, వేట, కొత్త జంట, గ్రీన్ సిగ్నల్, టెంపర్, దోచయ్ తదితర సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో ఆమె నటించిన 'ఒన్ నైట్ స్టాండ్' సినిమా మే 6న విడుదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement