ప్లీజ్‌.. నాపై సానుభూతి వద్దు.. | I Don't Need Sympathy: actress Shweta Basu Prasad | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. నాపై సానుభూతి వద్దు..

Jan 5 2015 10:10 AM | Updated on Apr 3 2019 9:17 PM

ప్లీజ్‌.. నాపై సానుభూతి వద్దు.. - Sakshi

ప్లీజ్‌.. నాపై సానుభూతి వద్దు..

తనపై ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదని టాలీవుడ్ హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ స్పష్టం చేసింది.‌

తనపై ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదని టాలీవుడ్ హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ స్పష్టం చేసింది.‌ రెస్య్యూ హోమ్‌ నుంచి విడుదలైన తర్వాత తాను మానసికంగా మరింత బలపడ్డానని తెలిపింది. కాగా వివాదాల్లో చిక్కుకున్న శ్వేత... ఇప్పుడిప్పుడే తన కెరీర్‌పై దృష్టి సారించింది.  ప్రస్తుతం ఆమె 'రూట్స్‌' అనే ఓ క్లాసికల్ మ్యూజిక్‌కు సంబంధించిన డాక్యుమెంటరిపై పని చేస్తున్నానని చెబుతున్న శ్వేతబసును ఓ ప్రయివేట్ చానల్ ఇంటర్వ్యూ చేసింది.


 *నేను చాలా బాగున్నాను. బలహీనపడాల్సిన పనేముంది.  ఏం జరిగింది ... ఏ జరగలేదు. జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. మనం వాటిని దాటేయాలి. కాలం ఎలాంటి గాయాన్ని అయినా మరిపిస్తుంది. మీరు నమ్మండి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.

*ఎప్పుడైతే మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ... అప్పుడే మీకు నిజమైన పరీక్ష. అప్పుడే మీకు అర్ధమవుతుంది జీవితం ఎంత కష్టమైందో.  ఒక్కసారి  ఆ పరిస్థితి నుంచి మీరు గట్టెక్కితే... ఇక మీరు ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగలరు. నేను అలాంటి కష్టాలను దాటి వచ్చానని గర్వంగా చెబుతున్నాను.  ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను.

*ప్రతీ ఒక్కరు నాపై విపరీతమైన సానుభూతిని ఒలకబోస్తున్నారు. నాపై అత్యాచారం జరగలేదు. నేను రేప్‌ విక్టిమ్‌ను కాదు. ప్లీజ్‌ నాపై ఇంతగా సానుభూతిని చూపకండి.  నాకు తెలుసు జరిగిన సంఘటన మంచిది కాదని... అది సాధారణమైన విషయం కాదని కూడా తెలుసు. కాని నాకు అదో ఎక్స్‌పీరియన్స్... నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం. ఈ సంఘటనకు సంబంధించి ఎవరిపైనా నేను కోపం పెంచుకోలేదు.

*సినిమా ఇండస్ట్రీ చెడ్డదేం కాదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సంతోషంగా పలకరిస్తారు. నాతో స్నేహంగా ఉంటారు.  

*ఇప్పుడు హన్సిల్ మెహతా ప్రాజెక్టు గురించి నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన సినిమా ఆఫర్‌కు సంబంధించి ఇంకా ఏదీ అఫిషియల్‌ కాలేదు. హన్సిల్‌ మెహతా ప్రాజెక్టు కావచ్చు లేక మరేదైనా... నేను ఆడిషన్స్‌కు హాజరవుతాను. నా సొంత టాలెంట్‌పైనే సినిమా అవకాశాలు సాధించుకుంటాను.

*నసీరుద్దిన్‌ షా నాకు ఓ సారి మెసేజ్‌ చేశారు. కోల్‌కతాలో ఆయన చేస్తున్న ఐన్‌స్టీన్‌ అనే షో చూడటానికి రమ్మన్నారు. ఆయన దగ్గర నా ఫ్రెండ్‌ పని చేస్తుంది. నేను సాధారణంగా అందరితో మరోసారి కలుపుగోలుగా ఉండాలని ఆయన సూచించారట.  నేను కూడా ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాను.
 
*రూట్స్‌ అనే డాక్యుమెంటరీపై పని చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం చాలామంది పెద్ద వ్యక్తులు ఒకే వేదికపైకి వచ్చారు.

*స్వేచ్ఛగా ఎగిరిపోతాను. నాకు రెక్కలున్న సంగతి వారికి తెలియదు. అందుకే నాలో నేను సంతోషపడుతుంటాను. నాపై ఏడిచే వారిపై జాలిపడతాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement